నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండియా కూటమి ఆలోచనను ఆయన గౌరవించారని చెప్పారు. హైదరాబాద్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో కలిసి సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంత్యంత ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ల్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టింది. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ.. తెలుగువాడికి ఇప్పుడొక అవకాశం వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మాజీ సీఎంలు కేసీఆర్, జగన్, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని రేవంత్‌రెడ్డి అన్నారు.