Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల నిర్వహణతోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య..

పాఠశాల నిర్వహణతోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య..

- Advertisement -

మండల విద్యాధికారి చంద్రుడు..
నవతెలంగాణ – వెల్దండ
పాఠశాల నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే ఆ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని వెల్దండ మండల విద్యాధికారి చంద్రుడు అన్నారు. శుక్రవారం వెల్దండ మండలం పరిధిలోని పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి చంద్రుడు మాట్లాడుతూ..గ్రంథాలయం నిర్వహణ, పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల యొక్క బేస్ లైన్ ప్రగతిని పరిశీలించడం, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి పై  ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నేర్పించడం, మధ్యాహ్న భోజనం సంబంధించిన వివరాలను చర్చించడం, విద్యార్థుల యొక్క హాజర్ ను ఆన్లైన్లో నమోదు అంశాన్ని, అదేవిధంగా పలు అంశాలను ప్రాథమిక పాఠశాలల  ప్రధానోపాధ్యాయులకు,  ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సమావేశంలో జడ్పీహెచ్ఎస్ వెల్దండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  రవీందర్,రాజశేఖర్, రిసోర్స్ పర్సన్ విష్ణు , స్వామి,  రాజు ,   సీఆర్పీ అంజ్యా నాయక్, చంద్రశేఖర్,  ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఫోటో. సమావేశంలో మాట్లాడుతున్న మండల విద్యాధికారి 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -