Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య

- Advertisement -

 ప్రిన్సిపల్ శ్రీనివాస్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు 

కళాశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని చిన్నకోడూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు నాణ్యమైన బోధన అందుతుందన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం అందించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కళాశాలలో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు రావాలని అధ్యాపకులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలన్నారు విద్యార్థులు ఆదర్శ శాతం పెంచాలని సూచించారు. అనంతరం కళాశాలలో చదివిన విద్యార్థులు వివిధ స్థానాల్లో స్థిరపడ్డ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -