Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య.!

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య.!

- Advertisement -

మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు..
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లుగా మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు తెలిపారు. గురువారం మండలంలోని వళ్లెంకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధించడానికి,నైపుణ్యతను అభివృద్ధి పరుచుకోవడానికి పలు అంశాలపై అవగాహన నిర్వహించ్చినట్లుగా,సమావేశం ఉపాధ్యాయులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.

ముఖ్యంగా పాఠశాలల్లో లైబ్రరీ బుక్స్,పీరియడ్స్ జరిగే విధంగా చూడాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు లైబ్రరీ బుక్స్ లర్నింగ్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారని, ఉపాధ్యాయులు అందరూ తప్పకుండా ప్రతి పాఠశాలలో లైబ్రరీ బుక్స్ పీరియడ్స్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండలంలోని రెండు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి.సుదర్శనం, సిహెచ్ తిరుపతి,ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,సిఆర్పిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -