మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవంగర
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎక్స్ రోడ్డు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంఈవో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన భాధ్యత మనందరి పై ఉందన్నారు. సర్కారు పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు రావాలన్నారు. అనంతరం పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభించి, విద్యార్థులకు టై, బెల్ట్, ఐడీ కార్డులు, నోట్ పుస్తకాలు, పలకలు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ ఈదురు రమా, ఉపాధ్యాయులు సౌభాగ్య, సీఆర్పీ నిరంజన్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES