Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య..

ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య..

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
అన్ని వసతులతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే  అందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన చిన్నకోడూరులోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు సిద్దిపేట ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు నేటి కైలాసం ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రార్థన విద్యార్థులకు ఉచితంగా అందించే షూ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మీరందరూ బాగా చదివి రాబోయే కాలంలో ఉన్నతంగా ఎదగాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్లే గ్రౌండ్ నాణ్యమైన విద్య అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. వాటిని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పాశి కంటి తిరుపతి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, మధుసూదన్ రెడ్డి,విశ్రాంత ఉపాధ్యాయులు నాగభూషణం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -