Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుణనాత్మకమైన విద్యను అందించాలి..

గుణనాత్మకమైన విద్యను అందించాలి..

- Advertisement -

మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

విద్యార్థులకు ఉపాధ్యాయులు గుణనాత్మకమైన విద్యను అందించాలని మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని వళ్లెంకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పిఎస్ లెవల్ కాంప్లెక్స్ సమావేశం రెండవ రోజు శుక్రవారం కొనసాగినట్లుగా ఎంఈఓ తెలిపారు.కాంప్లెక్స్ సమావేశంలో మండలంలోని అన్ని పిఎస్ పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్లలో మొదటిరోజు 50 శాతం,రెండవరోజు  మిగిలిన 50 శాతం టీచర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమావేశంలో ఎంఈఓ మాట్లాడారు. గుణాత్మక విద్యను విద్యార్థిని,విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం ద్వారా గుణాత్మక విద్యను ఎలా బోధించాలి,అందులో నైపుణ్యతను ఎలా సాధించాలనే అంశాలపై మండల ఆర్పీలు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ శిక్షణలో నేర్చుకున్నటువంటి వివిధ నైపుణ్యాలను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ వారి వారి పాఠశాలలో విద్యార్థులకు నేర్పే విధంగా కృషి చేయాలని అదేశించినట్లుగా తెలిపారు.లైబ్రరీ బుక్స్ ప్రతి పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండేలాగా చూడాలన్నారు. లైబ్రరీ పీరియడ్ను ప్రతి పాఠశాలలో అమలు పర్చలన్నారు.విద్యార్థులకు నూతన విషయాలను ఈ లైబ్రరీ పీరియడ్  ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రెండు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుదర్శనం,సిహెచ్ తిరుపతి,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -