Wednesday, September 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: ఎంపీడీవో

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని  మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వార్డెన్ గణేష్ కు సూచించారు. ఆశ్రమ పాఠశాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాహుల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -