- జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రవి కుమార్ నాయక్
నవతెలంగాణ-తిమ్మాజిపేట: వైద్య సేవల నాణ్యత, వ్యాక్సినేషన్ అమలు పైన మరింత సమర్ధవంతంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా రవి కుమార్ నాయక్ ఆదేశించారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యత, రికార్డు నిర్వహణ పద్ధతులను సమీక్షించారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వ స్థితి, నిల్వ ఉష్ణోగ్రతలు, వ్యాక్సిన్ రికార్డులను అదేవిధంగా ఓపీ ఔట్ పేషెంట్ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు రికార్డులు, వ్యాక్సిన్ లాగ్‌బుక్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా టీకాలు పొందేలా చర్యలు తీసుకోవాలని, డ్యూ లిస్ట్‌లో ఉన్నవారిని సమయానికి గుర్తించి వారికి వందశాతం టీకాలు అందించాలని ఆదేశించారు.
ప్రతీ టీకా వివరాలను సక్రమంగా నమోదు చేయడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ఎన్‌సీడి నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ శ్రీనివాసులు, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఫార్మసీ ఆఫీసర్ బాలరాజ్, వైద్య సిబ్బంది వున్నారు.



