- Advertisement -
– త్వరితగతిన పనులు చేయాలి
– సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆస్పత్రి భవన సముదాయ నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలకు లోబడి నిర్మించాలని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి కాంట్రాక్టర్ కు సూచించారు. శుక్రవారం వారు ఏరియా ఆస్పత్రి కోసం నిర్మిస్తున్న వంద పడకల భవన సముదాయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయి లో పరిశీలించారు.
ఎంత మేరకు పనులు చేసారు?ఇంకెంత కాలం లో పూర్తి స్థాయిలో చేస్తారు,నిర్దేశించిన నిర్మాణ సామాగ్రి నే వాడుతున్నారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా డ్రైన్ పనులు పూర్తి చేయాలని అన్నారు.
- Advertisement -



