- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన తెలంగాణ నేతలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కష్టపడిన నాయకులను అభినందించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విజయం గురించి రాష్ట్ర నేతలు రాహుల్‌కు వివరించారు.
- Advertisement -



