నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఐఆర్ పేరుతో బీహార్‌లో ఓట్ల చోరీకి ఈసీ పాల్పడుతుందని, అత్యాధునిక సాప్ట్ వేర్ సాయంతో ఓటర్ జాబితాలో లక్షల సంఖ్యలో పలు పేర్లను తొలగిస్తుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ స్పందించింది. ఎంపీ రాహుల్ గాంధీ చేసిన అన్ని ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసింది. ఆధారాలులేకుండా ఈసీపై ప్రతిపక్షనేత నిందలు వేస్తున్నారని మండిపడింది.
ఏ వ్యక్తి పేరును కూడా తాము తొలగించలేదని స్పష్టం చేసింది. పేర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, నిరాధారాహిత వ్యాఖ్యలని పేర్కొంది. ఆన్ లైన్ ద్వారా ఏ విధమైన తొలగింపులు చేపట్టలేదని, ఈసీపై ప్రజలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించింది. ఏ ఓటర్‌కు అవకాశంలేకుండా పేర్లలను తొలగించలేదని, ప్రతి ఒక్క ఓటర్‌కు తిరిగి మరో అవకాశం కల్పించామని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి తప్పు అని ఓ ప్రకటనలో పేర్కొంది.