- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తయారీ రంగంలో భారత్ వెనుకబడిపోయిందని, మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం విదేశీ పర్యటనలో భాగంగా ఆయన జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బెర్లిన్ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. నగరంలో బీఎండబ్ల్యూ (BMW) కార్ల షోరూంను రాహుల్ సందర్శించారు. అక్కడ భారత్‌కు చెందిన టీవీఎస్ (TVS) కంపెనీ తయారు చేసిన 450 సీసీ బైక్‌ను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాస భారతీయులు రాహుల్‌ను కలిశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.
- Advertisement -



