- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. నిరంతర వర్షపాతం కారణంగా యమునా నది నీటి మట్టం ఆదివారం ఉదయం 205.33 మీటర్ల కంటే ఎక్కువగా ప్రవహిస్తోంది. యమునా నది 204.5 మీటర్లు చేరడంతో హెచ్చరికను జారీ చేశారు. 205.33 మీటర్లు ప్రమాద సూచికగా పేర్కొన్నారు. 206 మీటర్ల చేరితే ప్రజలను తరలించడం ప్రారంభమవుతుంది. లోహా పుల్ మరియు మయూర్ విహార్ నుండి డ్రోన్ దృశ్యాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నట్లు చూపించాయి.
- Advertisement -