- Advertisement -
హైదరాబాద్, పుదుచ్చేరి రంజీ మ్యాచ్
పుదుచ్చేరి : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డి హైదరాబాద్, పుదుచ్చేరి రంజీ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. బి. పున్నయ్య (3/10), తనరు త్యాగరాజన్ (2/41) విజృంభించటంతో పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 92 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఆనంద్ (41), సిద్దాంత్ (16), శ్రీధర్ రాజు (11) మాత్రమే ఆ జట్టులో రెండెంకల స్కోరు చేశారు. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 435 పరుగుల భారీ స్కోరు సాధించగా.. మూడో రోజు ఆట ముగిసేసరికి పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో మరో 343 పరుగుల వెనుకంజలో నిలిచింది.
- Advertisement -



