Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలువర్షం ఎఫెక్ట్‌.. భారత్‌-ఆసీస్‌ తొలి టీ20 రద్దు

వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌-ఆసీస్‌ తొలి టీ20 రద్దు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టీ20కి వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.  మ్యాచ్‌ నిలిచే సమయానికి టీమ్‌ఇండియా 9.4 ఓవర్లకు వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. మ్యాచ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే వ‌ర్షం ప‌డింది. దీంతో 18 ఓవ‌ర్ల‌కు మ్యాచ్‌ను కుదించారు. ఆ త‌ర్వాత తొమ్మిది ఓవ‌ర్లు ముగిసేరికి మ‌రోసారి వ‌ర్షం కురిసింది. అయితే భార‌త ఓపెన‌ర్లు గిల్, అభిషేక్ తొలి వికెట్‌కు 35 ర‌న్స్ జోడించారు. నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. తర్వాతి మ్యాచ్ ఈ నెల 31న ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -