Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలువారం రోజులు వర్షాలే

వారం రోజులు వర్షాలే

- Advertisement -

– అన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ
– 13న బంగాళాఖాతంలో అల్పపీడనం
– ఆదివారం 400కిపైగా ప్రాంతాల్లో కురిసిన వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో సోమవారం నుంచి ఆదివారం వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలు బలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న హెచ్చరించారు. భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 13న వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 400కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ పేర్కొంది. నిర్మల్‌ జిల్లా, మండలంలోని అక్కాపూర్‌లో అత్యధికంగా 11.08 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
సోమవారం భారీ వర్షం సూచన ఉన్న జిల్లాలు
(ఎల్లో హెచ్చరిక) : ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి. (మిగతా జిల్లాలో మోస్తరు వానలు పడే అవకాశముంది)
మంగళవారం భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు
(ఎల్లో హెచ్చరిక) : ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌, అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం (మిగతా జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లో వర్షం కురియొచ్చు)
బుధవారం అతి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు (ఆరెంజ్‌ హెచ్చరిక) : ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు
భారీ వర్ష సూచన : హైదరాబాద, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్‌.
గురువారం అతి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు
( ఆరెంజ్‌ హెచ్చరిక) : హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌, నల్లగొండ, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌.
భారీ వర్ష సూచన(ఎల్లో హెచ్చరిక) : రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంగ గద్వాల.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img