వెంటాడుతున్న వర్షాలు
పంటలపై ప్రభావం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నకు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తునాయి. ఒకవైపు తెగుళ్లు ఆశించడం,మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నట్లుగా రైతులు వాపోతున్నారు. ప్రస్తుతానికి పత్తి పూత,గూడ దశలో వరి పొట్ట,గొలుసు దశల్లో ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వదలని వానతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు.ఇప్పటికే పత్తిలో గూడ రాలిపోయింది చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో మండల వ్యాప్తంగా 22,150 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా,ఇందులో పత్తి 4500,మిర్చి 1500,వరి 15,500 సాగు చేశారు.వరిలో దొడ్డు రకం 5 వేలు,సన్నాలు 10,500 వేల ఎకరాల్లో సాగు చేశారు.ఇందుకోసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాల కారణంగా పంట చేతికందుతుందా..? లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు వరుణ గండం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES