Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంAshwaraopet: అశ్వారావుపేటలో 14.8 మి.మీ వర్షపాతం

Ashwaraopet: అశ్వారావుపేటలో 14.8 మి.మీ వర్షపాతం

- Advertisement -




– పోటెత్తిన వాగు.. కూలిన వృక్షం… నీట మునిగిన ఇల్లు

– నిలిచిపోయిన రాకపోకలు,

– పునరుద్ధరించిన పోలీసులు

నవతెలంగాణ – అశ్వారావుపేట

అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అశ్వారావుపేట మండలంలో జనజీవనం స్తంభించింది. గురువారం ఉదయం నాటి అశ్వారావుపేటలో 14.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు తహశీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ తెలిపారు.

అశ్వారావుపేట – భూర్గంపాడు రోడ్ మార్గంలో ఆసుపాక – నందిపాడు మధ్యలో రోడ్డు కు అడ్డంగా భారీ చింత వృక్షం కూలిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట – అనంతారం రోడ్ మార్గం లో వాగొడ్డుగూడెం సమీపంలోని వాగు పోటెత్తడంతో అటు వైపుగా రాకపోకలు నిలిచిపోయాయి.తిరుములకుంట పంచాయితీ బొరియలగుట్టలో ముత్తమ్మ ఇల్లు నీట మునిగింది.

సమాచారం తెలుసుకున్న సీఐ నాగరాజు రెడ్డి, ఎస్ఐలు యయాతి రాజు, రామ్మూర్తిలతో సంఘటనా స్థలాలను పరిశీలించారు. ఆర్ అండ్ బి సిబ్బంది సహకారంతో చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. వాగు దాటకుండా లక్షణం చర్యలు చేపట్టారు. నీటి మునిగిన ఇంటిని పరిశీలించి నీటి తొలగించడానికి చర్యలు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad