Monday, October 27, 2025
E-PAPER
Homeఆటలుఆఖరు మ్యాచ్‌ వర్షార్పణం

ఆఖరు మ్యాచ్‌ వర్షార్పణం

- Advertisement -

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌

ముంబయి : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఆఖరు గ్రూప్‌ దశ మ్యాచ్‌ వరుణుడి ఖాతాలో పడింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. తొలుత బంగ్లాదేశ్‌ 27 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధ (3/30), శ్రీచరణి (2/23) రాణించారు. ఛేదనలో భారత్‌ 8.4 ఓవర్లలో 57/0తో ఉండగా వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత్‌, బంగ్లాదేశ్‌ పాయింట్లు పంచుకున్నాయి. ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా పోటీపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -