– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
– శుక్రవారం 300కిపైగా ప్రాంతాల్లో వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో హైదరాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీం అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రిభువనగిరి, ఖమ్మం, నల్లగొండ జిల్లాలున్నాయి. పలు జిల్లాల్లో బలమైన ఉపరిత గాలులు వీచే అవకాశముంది.
శుక్రవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 307 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం, ఆదిలాబాద్ మాల్వా మండలం రాంనగర్‌లో అత్యధికంగా 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వానలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES