Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపిల్లలకు, పెద్దలకూ నచ్చే'రాజా సాబ్‌'

పిల్లలకు, పెద్దలకూ నచ్చే’రాజా సాబ్‌’

- Advertisement -

అగ్రకథానాయకుడు ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘రాజా సాబ్‌’. టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈనెల 9న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈచిత్రం నుంచి ‘నాచె నాచె..’ సాంగ్‌ను ముంబయిలో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో కథానాయిక రిద్ధి కుమార్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా కోసం నాకు కాల్‌ వచ్చినప్పుడు నమ్మలేకపోయాను. నేను ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’లో నటించాను. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.

‘ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటించడం మరచిపోలేను. రొమాంటిక్‌ హర్రర్‌ ఫాంటసీ కథతో ఈ సినిమా చేశాం. హర్రర్‌, కామెడీ, రొమాన్స్‌, డ్రామా, యాక్షన్‌ లాంటి అన్ని అంశాలుంటాయి’ అని మరో నాయిక మాళవిక మోహనన్‌ చెప్పారు. కథానాయిక నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ,’రొమాంటిక్‌ హర్రర్‌ జోనర్‌లో తెరకెక్కింది. ఇది ఇండియన్‌ సినిమాకు కొత్త జోనర్‌. ప్రభాస్‌లాంటి బిగ్‌ స్టార్‌తో నటించడం గౌరవంగా భావిస్తున్నా.పిల్లలు, పెద్దలు అంతా ఈ సినిమాను ఇష్టపడతారు’ అని తెలిపారు. ‘ఇందులో నటించడం నాకు తెలుగులో మంచి గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నా. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని నటి జరీనా వహబ్‌ చెప్పారు. నటుడు బొమ్మన్‌ ఇరానీ మాట్లాడుతూ,’ప్రభాస్‌ అంటే అందరికీ ఇష్టం. నాకు కూడా చాలా చాలా ఇష్టం. అందుకే ఈ కథ, నాపాత్ర ఏమిటి అని అడగకుండా వెంటనే ఓకే చెప్పా’ అని చెప్పారు.

‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ’, ‘జాట్‌’, ‘మిరాయ్’ సినిమాలను ఇక్కడ రిలీజ్‌ చేశాం. ఇప్పుడు మా సంస్థలో చేసిన లార్జెస్ట్‌ మూవీ ఇది. బిగ్గెస్ట్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఈసినిమాని చేయటం గౌరవంగా భావిస్తున్నాం. ఆయన ‘బాహుబలి’కి ముందు ఎలా కనిపించారో ఈ సినిమాలో అలా కనిపిస్తారు. ఫన్‌, కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం మేం భారీ సెట్స్‌ నిర్మించాం. హై క్వాలిటీతో కాంప్రమైజ్‌ కాకుండా తెర మీదకు తీసుకొచ్చాం. మారుతి, తమన్‌తోపాటు ఈ సినిమాని హిందీలోకి తీసుకొస్తున్న అనిల్‌ తడానీకి థ్యాంక్స్‌. మాసినిమా సెట్స్‌ మీద ఉండగానే ‘కల్కి’, ‘సలార్‌’ చిత్రాలు విడుదలై, భారీ విజయాల్ని అందుకున్నాయి. దీంతో మా సినిమా స్కేల్‌ పెంచి మరింత భారీగా నిర్మించాం. -నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -