Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'రాజా సాబ్‌'.. నాకెంతో స్పెషల్‌

‘రాజా సాబ్‌’.. నాకెంతో స్పెషల్‌

- Advertisement -

ప్రభాస్‌, నిధి అగర్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజా సాబ్‌’. మారుతి దర్శకుడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతకాంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
ఆదివారం కథానాయిక నిధి అగర్వాల్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్‌ స్టిల్‌ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్‌ చేసిన టీజర్‌లో నిధి అగర్వాల్‌ క్యారెక్టర్‌ ప్రేక్షకుల్ని ఇంప్రెస్‌ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్‌ అందంతో పాటు నటనకు అవకాశం ఉన్న ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించనుందని టీజర్‌ స్పష్టం చేసింది అని చిత్రయూనిట్‌ పేర్కొంది.
ఈ సందర్భంగా నాయిక నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘ఈ మూవీ నా కెరీర్‌కు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాతో నాకు మరింతగా ప్రేక్షకుల అభిమానం లభిస్తుందనే నమ్మకం ఉంది. ప్రభాస్‌ లాంటి అగ్ర కథానాయకుడి సరసన ఈ చిత్రంలో నటించటం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన ‘హరిహరవీరమల్లు’ నా కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తే, ఈ సినిమా అంతకుమించి గుర్తుంపు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. చాలా భిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి తనదైన మార్క్‌తో ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందిస్తున్నారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad