హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు మంగళవారం మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.
ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్‌మెంట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్‌గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హర్రర్ జోనర్‌లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని డైరెక్టర్ మారుతి ఇవ్వబోతున్నారు. ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని, మ్యూజిక్ – తమన్, ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్‌కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కతి ప్రసాద్, కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల, ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్, రచన, దర్శకత్వం – మారుతి.
అందర్నీ మెప్పించే ‘రాజా సాబ్’
- Advertisement -
- Advertisement -