Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాజాసింగ్‌ రాజీనామా ఆమోదం

రాజాసింగ్‌ రాజీనామా ఆమోదం

- Advertisement -

– ఆమేరకు లేఖ రాసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌
– చివరి శ్వాస వరకూ సనాతన ధర్మం కోసం పనిచేస్తా : రాజాసింగ్‌
నవతెలంగాణ – బ్యూరో-హైదరాబాద్‌
ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ.నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(ప్రధాన కార్యాలయం ఇన్‌చార్జి) అరుణ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ మేరకు రాజాసింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. ‘సిద్ధాంతాలకు విరుద్ధంగా మీరు వ్యవహరించారు. పార్టీ పనివిధానానికి వ్యతిరేకంగా వెళ్లడం తగదు. మీరు లేవనెత్తిన అంశాలు కూడా అసందర్భం. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ. నడ్డా ఆదేశాల మేరకు మీ రాజీనామా ఆమోదిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయడానికి రాజాసింగ్‌ యత్నించగా పార్టీ నాయకత్వం నుంచి మద్దతు దొరకని విషయం విదితమే.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచందర్‌రావు నియామకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయనీయకపోవడాన్ని నిరసిస్తూ కేంద్రమంత్రి, అప్పటి అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి రాజాసింగ్‌ వ్యవహరిస్తున్న తీరు గురించీ, రాజీనామా లేఖ గురించీ జాతీయ నాయకత్వం దృష్టికి కిషన్‌రెడ్డి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా రాజాసింగ్‌ ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ పెద్దలతో సమావేశమ య్యారు. పార్టీ వివరణ అడిగితే ఇవ్వడానికి తాను సిద్ధమని కూడా ప్రకటించా రు. కానీ, బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం ఎలాంటి వివరణ కోరకుండానే రాజీనామాకు ఆమోద ముద్ర వేసింది. రాజీనామాపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. కరెక్టుగా ఇదే తేదీన 11 ఏండ్ల కిందట పార్టీలో చేరినట్టు గుర్తుచేసుకున్నారు. తనను నమ్మి మూడుసార్లు టికెట్‌ ఇచ్చిన నాయకత్వానికీ, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస వరకు హిం దూత్వం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తానని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -