- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల పరిధిలోని శ్రీరాంపుర్ గ్రామంలో శాంభవి ఫిల్లింగ్ స్టేషన్ ను బుధవారం ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంభవి సంస్థలు శాంభవి హై స్కూల్, శాంభవి ట్రేడర్స్, శాంభవి రోడ్ లైన్స్ ఇలా పలు రకాల సంస్థలు దిగ్విజయంగా అభివృద్ధి చేస్తూ ఇప్పుడు శాంభవి ఫిలింగ్ స్టేషన్ ప్రారంభిస్తున్నందుకు శాంభవి చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ రవీణ్ ప్రసాద్ లను రాజశేఖర్ అభినందించారు. ఈ రంగంలో కూడా వారు రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాంభవి ఫౌండర్ బొట్ల విజయలక్ష్మి, ఎంఈఓ బట్టు రాజేశ్వర్, వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



