Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్రాజస్థాన్ దొంగల ముఠా అరెస్టు

రాజస్థాన్ దొంగల ముఠా అరెస్టు

- Advertisement -

టైన్ లో వచ్చారు.. దోచుకున్నారు.. విమానంలో చెక్కేశారు
వారి నుంచి రూ.8లక్షల నగదు స్వాధీనం
నవతెలంగాణ – అంబర్పేట్
మొబైల్ షాపు షట్టర్ తాళాలు పగులగొట్టి షాపులో నుండి రూ.9 లక్షల నగదును దొంగిలించిన ఆరుగురు రాజస్థాన్ దొంగల ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండు కు తరలించారు. వారి నుంచి రూ. 8 లక్షల నగదు. ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అంబర్ పేట లోని ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. సుల్తాన్ బజార్, హనుమాన్ టేకిడి లో నివాసముండే మసర రామ్ దేవసి కోఠిలోని గుజరాత్ గల్లీలో లక్ష్మీ మొబైల్స్ పేరుతో మొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు.

ఈ నెల 4వ తేదీ ఉదయం అతను ఎప్పటిలాగే మొబైల్ షాపు దగ్గరకు రాగా, షట్టర్ లిఫ్ట్ చేసి, తాళాలు పగులగొట్టబడి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.9 లక్షల నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి అతను వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకోవడానికి డీసీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సీసీటీవీ పుటేజీల ద్వారా దర్యాప్తు ప్రారంభించింది. అయితే గతంలో లక్ష్మీ మొబైల్స్ తో పాటు కోఠి గుజరాతి గల్లీలోని వివిధ మొబైల్ షాపుల్లో పని చేసిన రాజస్థాన్, జాలోర్, జుంజానికి చెందిన రసరామ్ దిల్సుఖ్ నగర్ పి అండ్ టి కాలనీలో నివాసముంటూ ఈ చోరీకి స్కెచ్ వేశాడు. లక్ష్మి మొబైల్ షాపు బాగా నడుస్తుందని, అందులో పెద్ద మొత్తంలో క్యాష్ ఉంటుందని తెలుసుకుని, ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img