– జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
దేశం కోసం ఎంతో సేవ చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత రాజీవ్ గాంధీ కుటుంబానిదని జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకాలతో పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, భూములను పేద ప్రజలకు పంచిన ఘనత ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. దేశానికి కంప్యూటర్ టెక్నాలజీని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఎన్నో మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు రహదారులు నిర్మాణం చేపట్టి దేశాన్ని ముందు వరసలో తీసుకొచ్చిన నాయకులు అని చెప్పక తప్పదన్నారు. రాజీవ్ గాంధీ గురించి ఈ తరం యువతకు తెలివాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గూగుల్ పండ్ల పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ వైస్ ఛైర్మన్ బంక చందు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.