నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల యువతకు ఈ పథకం ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వనుంది. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం, నిరుద్యోగ సమస్యను తగ్గించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతను ఆర్థికంగా అభివృద్ధి పరచటం వంటి లక్ష్యాలతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
80 శాతం వరకు సబ్సిడీతో రూ.50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి ఇప్పటికే యువత నుంచి అఫ్లికేషన్లు తీసుకున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 అఫ్లికేషన్ ప్రాసెస్ ముగియగా.. లక్షల్లో అప్లయ్ చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. మండల స్థాయి కమిటీలు అర్హులను ఎంపిక చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యువతకు శుభవార్త అందించారు.
అచ్చంపేటలో జరిగిన ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రుణాల మంజూరు ప్రక్రియపై కీలక ప్రకనట చేశారు. రాజీవ్ యువ వికాస పథకానికి జూన్ 2న రూ.1000 కోట్ల నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షమని, ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాజీవ్ యువ వికాసం..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
- Advertisement -
- Advertisement -