- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అల్లూరి సీతారామరాజు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన సమాజ హక్కులు మరియు సంక్షేమం కోసం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత చరిత్రకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -