Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ భాష్యం స్కూల్లో రాఖీ వేడుకలు..

శ్రీ భాష్యం స్కూల్లో రాఖీ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని శ్రీ భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు పరస్పరంగా రాఖీలు కట్టి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ భూష రత్నాకర్ మాట్లాడుతూ రాఖీ పండుగ పరస్పర ప్రేమకు ప్రతీక అని విద్యార్థులకు వివరించారు. ఈ పండుగ రోజున, ఒక సోదరి తన సోదరుడు తన జీవితాంతం కష్ట సమయాల్లో తనను రక్షిస్తాడనే నమ్మకంతో తన సోదరుడి మణికట్టుపై రాఖీ కడుతుంది. మనమందరం పరస్పర సంబంధాలకు, ప్రేమతో జీవితాలకు విలువ ఇవ్వాలని పిల్లలకు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -