– రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో శనివారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ సీఎంకు రాఖీలు కట్టారు. రాష్ట్రంలోని మహిళల కోసం అనేక పథకాలను రూపొందించి, అమలు చేస్తున్న సీఎంకు రాఖీలు కట్టటం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వారు ఈ సందర్భంగా తెలిపారు. మహిళా కమిషన్ చైర్మెన్ నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ సుజాత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, బీసీ కమిషన్, విద్యా కమిషన్, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్, రైతు కమిషన్‌కు చెందిన మహిళా సభ్యులు, ఇతర మహిళా నాయకులు, బ్రహ్మకుమారీస్ బంద సభ్యులు సీఎం రేవంత్‌కు రాఖీలు కట్టారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సీఎం నివాసంలో ఘనంగా రక్షాబంధన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES