- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని జంబి హనుమాన్ దేవాలయంలో శనివారం కమ్మర్ పల్లి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “నేను నీకు రక్ష, మీరు నాకు రక్ష–మనమందరము ఈ దేశానికి, ధర్మానికి రక్ష” అనే ఆత్మబంధంతో ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు రక్షాబంధన్ రాఖీలను కట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రేమ, స్నేహం, పరస్పర రక్షణతో ప్రతి కుటుంబం సుఖశాంతులతో నిండిపోవాలని కోరుకుంటు ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -