నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రక్షాబంధన్ పండుగను సోదరభావం, మత సామరస్యానికి ప్రతీకగా ఘనంగా జరుపుకున్నారు.. ఈ సందర్భంలో సీడీసీ ఛైర్మన్ మహ్మద్ ఇర్షాదుద్దీన్ కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
పిఎసియస్ ఛైర్మన్ మర్రి సదాశివ రెడ్డి CDC చైర్మన్ కు రాఖీ కట్టి మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ దేశాలకు మత సామరస్యానికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది అని, ఈ దేశ ప్రజలు అన్ని మతాలను గౌరవిస్తారని అన్నారు. రక్షాబంధన్ వంటి పండుగలు సమాజంలో ప్రేమ, విశ్వాసం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొలిపెల్లి మహేందర్ రెడ్డి, సంకరి విఠల్, ముదాం సత్యం, చెరుకు ప్రసాద్, ఆకుల కృష్ణ, చెట్కూరి మహేందర్ తదితరులు పాల్గొని సంతోషాన్ని పంచుకున్నారు.