Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు శనివారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నాచెల్లెళ్ల ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రతిరూపమైన రాఖీ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ రక్షాబంధన్ పురస్కరించుకొని తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు పుట్టింటికి తరలివచ్చారు. తమ అన్న తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. తోబుట్టువులను దీర్ఘాయుష్షు, ఆరోగ్యం విజయాలు కలగాలని సోదరులు దీవించి కానుకలను అందజేశారు. అనంతరం అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -