నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రములో పద్మశాలి కుల బంధువుల ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం ఆవరణలో రక్ష బంధన్, గాయత్రీధారణ (జంధ్యారాల) కార్యక్రమం మహేష్ పంతులు చేతుల మీదుగా గాయత్రి మంత్రం, సూర్య నమస్కారం మంత్రాలతో నిర్వహించారు. రాఖి పూర్ణిమ రోజున పాత జంధ్యారం తీసి వేసి కొత్త జంధ్యారం ధరించడం మా పద్మశాలిలా సంప్రదాయం జంధ్యరాలు ధరించిన వారు కొన్ని నే మాలు పాటిస్తారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ఉస్కాల్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రచ్చ కుశాల్ కుమార్, అందె సందీప్, జెయింట్ సెక్రటరీ రచ్చ నాగేష్, రాష్ట్రా జాయింట్ సెక్రెటరీ సుంకి రమణ, జిల్లా నిర్వాహక సభ్యులు రచ్చ పెంటేష్, సలహా దారులు ఉస్కాల్ సురేష్, పద్మశాలి కులబంధువులు తదితరులు పాల్గొన్నారు.
భక్త మార్కండేయ ఆలయంలో రక్షాబంధన్ గాయత్రి ధారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES