Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోషం వెల్లివిరిసింది. ఉపాసన రెండోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ శుభవార్తను ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా తన నివాసంలో జరిగిన వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను ఉపాసన పంచుకున్నారు. ఆ వీడియో ద్వారా తాను గర్భవతిననే విషయాన్ని ఆమె సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని రోజులకే, ఆమె కోసం కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు, కామినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవాతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాసన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ సీమంతం వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -