నవతెలంగాణ-హైదరాబాద్: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. ‘వ్యూహం’ సినిమా విడుదల సమయంలో… చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో ఆయనపై కేసు నమోదయింది. ఇదే సమయంలో ఆయనపై పలు పీఎస్ లలో కూడా కేసులు నమోదయ్యాయి.
అయితే, ఈ కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పోలీసుల విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మ ఒకసారి విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గత నెల 22న వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు హాజరవుతానని పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చారు.
నేడు పోలీసు విచారణకు రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES