Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుమద్నూర్ మండలంలోని నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా

మద్నూర్ మండలంలోని నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా

- Advertisement -

తహశీల్దార్ ఎండి ముజీబ్

నవతెలంగాణ మద్నూర్

ఈ నెలలో జరగబోయే రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించనుంద నీ మద్నూర్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్, డోంగ్లి ,బిచ్కుంద, జుక్కల్, పెద్ద కోడప్పగల్, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, మండలాలకు 1250 మందికి రంజాన్ తోఫా ప్రభుత్వం సరఫరా చేసిందని ఈ రంజాన్ తోఫా ఎనిమిది మండలాలకు మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం నుండి ఆయా మండలాల తాసిల్దార్ కార్యాలయాలకు సరఫరా చేయడం జరుగుతుందని తాసిల్దార్ తెలిపారు వీటిని అర్హులైన నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుందని ఈ తోఫా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయా మండలాల పరిధిలో పంపిణీ చేయడం జరుగుతుందని తాసిల్దార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -