Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల పెన్నిధి రామలింగన్న: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

పేదల పెన్నిధి రామలింగన్న: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
పేదలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి వారి జీవితాల్లో ఆశాజ్యోతి గా నిలిచిన గొప్ప వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి అని ఆయన చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేశారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 5 వ వర్ధంతి సందర్భంగా బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ లో సోలిపేట రామలింగారెడ్డి స్మృతి వనం వద్ద, దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్దనున్న రామలింగారెడ్డి విగ్రహాలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, రామలింగారెడ్డి సతీమణి సుజాత, రామలింగారెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ లతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి తో తనకున్న 25 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని ఎమ్మెల్యే గుర్తు చేస్తూ.. రామలింగన్న స్ఫూర్తితో నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..

దుబ్బాక లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 109 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.25 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఆయన వెంట దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ దుబ్బాక, అక్బర్ పేట భూంపల్లి మండలాల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, జీడిపల్లి రవి, పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -