- Advertisement -
- ఎన్నో ఏండ్లుగా వున్నచెరువు కట్టపై కంప చెట్ల తొలగింపు
– హార్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలంలోని నాయినవానికుంట తండాలో చెరువు కట్టపై ఎన్నో ఏళ్లుగా ఉన్న కంప చెట్లు పెరిగి వ్యవసాయ భూములకు వెళ్లేందుకు అడ్డుగా వున్నాయి. ఎవరు పట్టించు కొక పోవడం తో తండాకు చెందిన రమావత్ వినోద్ మానవత్వంతో ముందుకు వచ్చి సొంత ఖర్చులతో గ్రామస్తులు, రైతులు ఇబ్బంది పడుతున్న విధానాన్ని సూసి తండా రైతుల సహకారంతో జేసీబీతో బుధవారం కంప చెట్లు తొలగించారు.
చెరువు కట్టలపై ఉన్న కంప చెట్లను తొలగించడం వల్ల చెరువుకట్ట బలోపేతానికి, భూములు వ్యవసాయాభివృద్ధికి సహాయపడుతుంది. చెరువు కట్టల పటిష్టత కోసం, నీరు నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, మరియు కట్టల వెంట ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఈ కంప చెట్లను తొలగించారు. చెరువు కట్టలపై కంప చెట్లు పెరగడం వల్ల కట్టలు బలహీనపడతాయి. వీటిని తొలగించడం వల్ల కట్ట బలంగా మారుతుంది. అంతే గాక చెరువు కట్టలపై ఉన్న చెట్లు, మొక్కలు, నీటి ప్రవాహానికి, రాకపోకలకు అడ్డంకిగా ఉంటాయి. వీటిని తొలగించడంతో మాకు ఇబ్బందులు తొలగి పోయాయని, ఇన్నాళ్లుగా మా తండాలో ఇలాంటి మంచి పనులకు ఎవరు ముందుకు రాలేదని తండా, ప్రజలు, రైతులు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -