Wednesday, July 2, 2025
E-PAPER
Homeసినిమారెండు భాగాలుగా'రామాయణ'

రెండు భాగాలుగా’రామాయణ’

- Advertisement -

రణ్‌బీర్‌ కపూర్‌ రాముడుగా, యష్‌ రావణుడిగా, సీతగా సాయి పల్లవి, సన్నీ డియోల్‌ హను మంతుడిగా, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. దీనికి నితేష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇందులో భాగంఆ ‘రామాయణ : ది ఇంట్రడక్షన్‌’కి సంబంధించి షూటింగ్‌ ర్తయ్యింది. నమిత్‌ మల్హోత్రా ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, 8 సార్లు ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో డిఎన్‌ఇజి, యష్‌ మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ యుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాయణ పార్ట్‌ 1 వచ్చే ఏడాది దీపావళికి, అలాగే పార్ట్‌ 2 2027 దీపావళి కానుకగా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఒక సాంస్కతిక సమ్మేళనమైన కథ. రామాయణంతో మేము చరిత్రను తిరిగి చెప్పడం మాత్రమే కాదు. మేము మా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. విశ్వవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను ఒకచోట చేర్చడం వల్ల ఈ కథను ప్రామాణికత, భావోద్వేగం, అత్యాధునిక సినిమాటిక్‌ ఆవిష్కరణతో చెప్పడానికి మాకు వీలు కల్పించింది’ అని అన్నారు.


‘రామాయణం అనేది మనందరికీ తెలిసిన కథ. ఇది మన సంస్కతి విశిష్టతను కలిగి ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని గౌరవించడంతోపాటు సినిమాటిక్‌ స్కేల్‌తో దానిని ప్రదర్శించడం మా లక్ష్యం. ఇది సహస్రాబ్దాలుగా కొనసాగిన కథ. మేము కేవలం సినిమా తీయడం లేదు. మేము ఒక దర్శనాన్ని అందిస్తున్నాం’ అని దర్శకుడు నితేష్‌ తివారీ చెప్పారు. ‘ఈ ప్రాజెక్ట్‌లో వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పట్నుంచి వింటూ పెరిగాం. ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్‌ చేస్తున్నారు. నితీష్‌ తివారీ దీన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’ అని రణ్‌బీర్‌ కపూర్‌ తెలిపారు. ఇక ‘రామాయణ : ది ఇంట్రడక్షన్‌’కి సంబంధించి టైటిల్‌ గ్లింప్స్‌ ఈనెల 3వ తేదీన దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -