నవతెలంగాణ – కామారెడ్డి
మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ ర్యాండమైజేషన్ కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే బాన్సువాడ నియోజక వర్గంలోని 8 మండలాలు బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్ పెద్దకోడ్ పగల్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది యెుక్క మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జనరల్ అబ్సర్వర్ సమక్షం లో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ , జిల్లా చీఫ్ పనింగ్ అధికారి రఘునందన్ , ఎస్ ఓ శివకుమార్ , జిల్లా పంచాయతీ అధికారి మురళి, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గోన్నారు.
మూడవ విడత ఎన్నికల ర్యాండమైజేషన్ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



