హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ (ఎస్‌ఐటీఎస్‌ఎ) కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
రాఘవ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సీరియల్ ప్రముఖులు, యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు.
టెలివిజన్ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా మొదలైన ఎస్‌ఐటీఎస్‌ఎ అవార్డ్స్, దక్షిణ భారతదేశంలో నాలుగు భాషల సీరియల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చరిత్ర సష్టించనుంది. ఇప్పటివరకు ప్రతి ఛానల్ తన సొంత అవార్డులు విడివిడిగా నిర్వహించేది. ఇప్పుడు నాలుగు భాషలు, నాలుగు రాష్ట్రాల కళాకారులను ఒకేసారి గౌరవించడం ఇండిస్టీలో మైలురాయిగా నిలవబోతుంది.
టెలివిజన్ పరిశ్రమ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ ఇదే మొదటిసారి. ఈవెంట్లో మాట్లాడిన ప్రముఖులు.. టీవీ కళాకారులు, టెక్నీషియన్లు గత 50 ఏళ్లుగా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నా, వారికి గుర్తింపు ఇవ్వడంలో జరిగిన లోపాలను గుర్తు చేశారు. ప్రభుత్వాలు, సంస్థలు ముందుకు రాకపోవడం వలన చిన్న చిన్న సంస్థలే అవార్డులు ఇచ్చేవి. ఇప్పుడు రాఘవ మీడియా ద్వారా సౌత్ ఇండియా మొత్తం టీవీ పరిశ్రమకు గౌరవం లభించడం గర్వకారణమని అందరూ అభిప్రాయపడ్డారు. ఎస్‌ఐటీఎస్‌ఎ అవార్డ్స్ నిర్వహకులు మధు మాట్లాడుతూ,’ఎన్నో సంవత్సరాలుగా సీరియల్స్‌కు కాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేశాను. అన్ని భాషలకు కూడా ఆర్టిస్టులను అందించాను. ఎప్పటినుంచో ఇలాంటి ఈవెంట్ చేయాలని ఉండేది. ఇన్నాళ్లకు కల నెరవేరబోతుంది. ఈ అవార్డ్స్ మెయిన్ ఫంక్షన్ ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది’ అని తెలిపారు.
అరుదైన అవార్డులు
- Advertisement -
- Advertisement -



