Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీవిష్ణు సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో అరుదైన చికిత్స 

శ్రీవిష్ణు సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో అరుదైన చికిత్స 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ లో అరుదైన వైద్య చికిత్స  చేశామని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రామనేశ్వర్ తెలియజేశారు. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అరుదైన వైద్య చికిత్స వివరాలు తెలియజేశారు. కమ్మరపల్లి మండలం, బషీరాబాద్ గ్రామం కు చెందిన రాజేందర్ అనే పేషెంట్ కొన్నిరోజులుగా డెంగ్యు జ్వరంతో బాధపడుతుండేవాడు.

ఈ క్రమంలో బాదిత యువకుడు పలు ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్నా.. ఫలితం లేకపోయింది. దీంతో తెలిసిన పేషెంట్ ద్వారా శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఆపస్మారక, నడవలేని స్థితిలో రావడం జరిగింది అని తెలియజేశారు. ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లక్ష్మీరెడ్డి పేషెంట్ ను చూసి ఎమ్మారై బ్రెయిన్, స్పైన్, తగు పరీక్షలు చేసి ఇది డెంగ్యు జ్వరం వచ్చి బ్రెయిన్ కి, స్పైనల్ కార్డుకు వ్యాపించడం జరిగిందని పేషెంట్ తల్లితండ్రులకు తెలిపారు. ఈ క్రిటికల్ కేసు ను వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించామన్నారు.

అలాగే వెంటిలేటర్ చికిత్సను డా. రమణేశ్వర్ న్యూరో, డా.విఠల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఇతర వైద్య బృందంల సహాయంతో వైద్య చికిత్స అందించగా ఇప్పుడు పేషెంట్ పూర్తిగా కోలుకొని తనంతట తను నడవడం జరుగుతుంది క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందానికి ఋణపడి ఉంటామని పేషెంట్ తల్లితండ్రులు మీడియాతో తెలిపారు. ఎల్లవేళలా ఆస్పత్రి వైద్య బృందం శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రమణేశ్వర్ న్యూరో ప్రజలకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -