Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుగురుకులంలో ఎలుకలు

గురుకులంలో ఎలుకలు

- Advertisement -

ఆరుగురు విద్యార్థులకు గాయాలు
చికిత్స చేయించి..వ్యాక్సిన్‌ వేయించిన ప్రిన్సిపాల్‌
నవతెలంగాణ- హుజూరాబాద్‌

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధి బోర్నపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల(సైదాపుర్‌)లో బుధవారం రాత్రి ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 8వతరగతి విద్యార్థులు యశ్వంత్‌, సాయిచరణ్‌, కౌశిక్‌, అక్షిత్‌, సృజన్‌, 9వ తరగతికి చెందిన రక్షిత్‌ను పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు హుజురాబాద్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించి, వ్యాక్సిన్‌ వేయించారు. విషయం తెలుసుకున్న ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ బండ శ్రీనివాస్‌, పలువురు నాయకులు పాఠశాలకు వెళ్లి పిల్లలను పరామర్శించారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ రాణిని వివరణ కోరగా.. విద్యార్థులకు ప్రమాదం ఏమీ లేదని, ఆరుగురిని కరిచినట్టు తెలిసిందని, మరో ముగ్గురిని కరిచినట్టు అనుమానం ఉందని తెలిపారు. అందరికీ వ్యాక్సిన్‌ వేయించినట్టు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad