– 8 మంది విద్యార్థులను కరిసిన వైనం
– మెదక్ జిల్లా నారాయణపూర్‌లో ఘటన
నవతెలంగాణ-నర్సాపూర్
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ శివారులోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో 8 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి హాస్టల్ భవనంలో నిద్రిస్తున్న సమయంలో విద్యార్థి నులు నిఖిత, జ్యోతి, ఉష, గీతాంజలి, సంధ్య, అశ్విత, మరో ఇద్దరిని ఎలుకలు కరిచాయి. ఈ విషయాన్ని వెంటనే ఉపాధ్యాయులకు తెలపడంతో.. వారిని నర్సా పూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. కాగా, హాస్టల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల భద్రత విషయంలో ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రన్సిపల్ లలితాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులకు కాళ్లపై నుంచి ఎలుకలు పోయి.. కరిచిన విషయం వాస్తవమేనని అన్నారు. వెంటనే స్పందించి వారిని హాస్పటల్‌కు తరలించి చికిత్స చేయించినట్టు చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
గురుకులంలో ఎలుకల కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



