4 కార్లు, 11 సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం
శేరిలింగంపల్లి మండలంలో ఘటన
నవతెలంగాణ – శేరిలింగంపల్లి
నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీ నిర్వహించిన వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఎస్‌వి సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఏపీలోని విజయవాడకు చెందిన నాయుడు, శివం నాయుడు మారు పేర్లతో పార్టీలు నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి కూడా పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు పార్టీని భగంచేశారు. 9 మందిని అరెస్టు చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరి నుంచి 2.08 కేజీల గంజాయి, 50 ఓ జీ కుష్ గంజాయి, 11.57 మ్యూజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్, 4 కార్లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కగార్ రాహుల్, ఇమ్మాన్యుయేల్, అప్పికట్ల అశోక్ నాయుడు, సమ్మెట సాయి కృష్ణ, నాగళ్ల లీలా మణికంఠ, కాజా, హిల్టన్ జోసెఫ్ రోల్ఫ్, అడపా యశ్వంత్ శ్రీ దత్తా, తోట కు మార్ స్వామి, నందం సుమన్ తేజ ఉన్నారు. శ్రీనివాస్ చౌహరి, అఖిల్ వర్మ అనే ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
రేవ్ పార్టీ భగం.. తొమ్మిది మంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES