- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బడుగుల రవి ఆ గ్రామానికి చెందిన 250 మంది రైతులకు ఇంటింటికి ఒక టార్పాలిన్ కవర్ ( వాన కవర్లు)ను ఉచితంగా పంపిణీ చేసి తన ఔదార్యం చాటుకున్నారు. ఒక్కొక్క టార్పాలిన్ కవర్ దాదాపు రూ.2500 విలువ ఉంటుంది. అయితే గ్రామంలో ఉన్న 250 మంది రైతులకు రూ.6,25,000 వెచ్చించి బడుగుల రవి రైతులకు అండగా నిలిచారు. రవి గతంలో కూడా గ్రామానికి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రజల అవసరాలను బట్టి చేసే సేవలను గుర్తించి రవిని గ్రామపెద్దలు యువత రైతులు అభినందించారు.
- Advertisement -

                                    

