- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కీ. శే. రావి నారాయణ రెడ్డి నిలువెత్తు కాంస్య విగ్రహ స్థాపన ఆగస్టు రెండవ తేదీన బొల్లేపల్లి గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందనీ విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరు కావాలని ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. గురువారం వారికి వేర్వేరుగా ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ కార్యదర్శి రావి సుఖేష్ రెడ్డి, ముఖ్య సలహాదారు భువనగిరి సత్యనారాయణ పాల్గొన్నారు.
- Advertisement -